మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు. అది కూడా తన తదుపరి సినిమా విషయంలో కావడం విశేషం. ఈ ఏడాది త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా ‘S/O సత్యమూర్తి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమాపై చాలా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సినిమా అది కాకపోయే సరికి సమంతతో సినిమా, అదే కాదనే సరికి నాగ చైతన్యతో సినిమా ఉంటుందని ఇలా పలు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఇవన్నిటినీ పక్కక్కి పెట్టి మరో కొత్త యంగ్ హీరో పేరు తెరపైకి వచ్చింది. అతనే యంగ్ హీరో నితిన్.
ఈ విషయంపై కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ బేసిక్ గా ఓ స్టొరీ లైన్ నితిన్ కి చెప్పాడు, ఆ స్టొరీ లైన్ నితిన్ కి బాగా నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అలాగే అన్ని చర్చలు పర్ఫెక్ట్ గా ముగిస్తే ఈ నెల చివర్లోనే ఈ సినిమా అధికారికంగా లాంచనంగా ప్రారంభమయ్యే అవకాశం కూడా. ఉంది మరి ఈ సినిమా ఖరారు అయిన విషయమపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం నితిన్ అక్కినేని అఖిల్ తో చేస్తున్న సినిమా ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.


