తెలుగు రాష్ట్రాలకు మద్దతుగా త్రివిక్రమ్..!

Published on Mar 26, 2020 10:55 am IST

డైరెక్టర్ త్రివిక్రమ్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. కరోనా పై యుద్ధంలో భాగంలో ప్రభుత్వాలకు సినీతారలు మరియు ప్రముఖులు విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెరో 10 లక్షలు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వాలకు మద్దతుగా 20 లక్షల సాయం ప్రకటించారు.

ఇక ఈ ఏడాది అల వైకుంఠపురంతో భారీ బ్లాక్ బస్టర్ ఆయన అందుకున్నారు. బన్నీ, పూజ హెగ్డే హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More