‘అ’ సెంటిమెంట్ ‘అల’ కలిసొచ్చింది ఆయనకి.. !

Published on Jan 18, 2020 8:01 am IST

బన్నీ అల వైకుంఠపురంలో సినిమాతో యూఎస్ లో మొదటి సారి $2 మిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురంలో చిత్రం అక్కడ $2 మిలియన్ మార్క్ వసూళ్లను దాటివేసింది. ఐతే ఇది దర్శకుడు త్రివిక్రమ్ కి నాలుగవ సినిమా కావడం విశేషం. ఆయన తెరకెక్కించిన అజ్ఞాతవాసి,అ ఆ, అరవింద సమేత, అల వైకుంఠపురంలో చిత్రాలు $2 మిలియన్ వసూళ్లు సాధించాయి. ఈ ఫీట్ నాలుగు సార్లు సాధించిన ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ కావడం విశేషం. ‘అ’ సెంటిమెంట్ త్రివిక్రమ్ కి ‘అల’ కలిసొచ్చింది.

ఇక అల వైకుంఠపురంలో మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటించగా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు వంటి వారు కీలక రోల్స్ చేశారు. థమన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ మీట్స్ వైజాగ్ లో ఈనెల 19న,తిరుపతిలో 24న జరుగనున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More