తారక్ కోసం త్రివిక్రమ్ అలా ప్లాన్ చేశారా.?

Published on Aug 11, 2020 8:03 am IST

మన టాలీవుడ్ లో మంచి మాస్ క్రౌడ్ పుల్లింగ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే తారక్ లోని చాలా కాలం తర్వాత మాస్ లోని సిసలైన యాంగిల్ ని చూపించింది మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అనే చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కాంబోలో వచ్చిన మొట్ట మొదటి సినిమా “అరవింద సమేత వీర రాఘవ”. గత 2018లో విడుదలైన ఈ ఫ్యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ తారక్ అభిమానులకు మంచి ఫీస్ట్ లా నిలిచింది.

దీనితో ఈ కాంబో నుంచి మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూసారు. ఈలోపు లోనే ఎవరి బిజీలో వారు ఉంటూనే “అయినను పోయి రావలె హస్తినకు” అనే చిత్రాన్ని అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా వీరి కాంబోపై మరో ఆసక్తికర గాసిప్ వినిపిస్తుంది. నిజానికి అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ తారక్ కోసం రెండు ప్రాజెక్టులను ప్లాన్ చేశారట. కానీ తారక్ మాత్రం ఈ చిత్రాన్ని పిక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అలా “అయినను పోయి రావలె హస్తినకు” ఓకే అయ్యిందట.

సంబంధిత సమాచారం :

More