మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేయాల్సి ఉంది. కానీ, బన్నీ తన నెక్స్ట్ మూవీని తమిళ దర్శకుడు అట్లీతో చేస్తుండటంతో త్రివిక్రమ్‌తో మూవీ వాయిదా పడింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రాన్ని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నాడట. కాగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, అంతకంటే ముందు త్రివిక్రమ్‌తో చరణ్ ఓ సినిమా చేస్తాడని.. అదే వెంకీ-త్రివిక్రమ్ మూవీ అని తెలుస్తోంది.
దీంతో త్రివిక్రమ్ చేయబోయే మల్టీస్టారర్ చిత్రంలో చరణ్ కూడా నటిస్తాడనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇక గతంలో పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల చేసిన వెంకీ, ఇప్పుడు చరణ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.