మహేష్ తో మరో లెవెల్లో ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.?

Published on Aug 28, 2021 7:17 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట” షూట్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న మహేష్ చిన్న బ్రేక్ లో ఇప్పుడు ఉన్నారు. అయితే ఈ చిత్రం అనంతరం మహేష్ తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నారని తెలియడంతో ఇక ఈ కాంబో హైప్ ఇంకో స్థాయిలోకి వెళ్ళింది.

అయితే ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని బహుశా పాన్ ఇండియన్ స్కేల్ లో కూడా ఉండొచ్చని కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ హాలీవుడ్ టెక్నిషియన్స్ ని రంగంలోకి దింపనున్నారట. అలాగే ఇది ఒక సాలిడ్ రివెంజ్ డ్రామాలా ఉండొచ్చని టాక్. మరి ఇవన్నీ ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :