పవన్ కోసం త్రివిక్రమ్.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు

Published on Jan 27, 2021 5:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా చిత్రాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడ ఇకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇనులో ప్రముఖ నటుడు రానా సెకండ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం వెనుక దర్శకుడు, పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం చాలానే ఉంది. ఈ సినిమాకు ఆయనే మాటలు అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో ఒకదాన్ని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో కూడ త్రివిక్రమ్ ప్రముఖంగా కనబడ్డారు. దాదాపు దర్శకుడితో సమానంగా అన్ని పనులు చూసుకుంటూ కనబడ్డారు. దీన్నిబట్టి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటల వరకే పరిమితం కాకుండా దర్శకత్వం మీద కూడ పర్యవేక్షణ పెట్టినట్టు అనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అవుట్ ఫుట్ గొప్పగా రావాలనే ఉద్దేశ్యంతో ఆయన సాగర్ కె చంద్రకు అన్ని విధాలుగా సపోర్ట్ అందిస్తున్నారు. మొత్తానికి గురూజీ సినిమా మీద స్పెషల్ కేర్ పెట్టారని మాత్రం అర్థమవుతోంది. ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు నెలలో రిలీజ్ చేస్తారనే టాక్ కూడ ఉంది.

సంబంధిత సమాచారం :