మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో త్రివిక్రమ్ ముచ్చటగా మూడో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.
అయితే, ఈ సినిమాపై మొదట్నుండీ పలు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ రుక్మిణి వసంత్‌ను సెలెక్ట్ చేశాడట త్రివిక్రమ.
ఆమె అయితే ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమాలో వెంకీ సరసన రుక్మిణి వసంత్‌ను మేకర్స్ ఓకే చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలో స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.