‘కోబలి’ కథను త్రివిక్రమ్ ఎవరికిస్తారో ?

Published on Apr 27, 2021 9:46 am IST

త్రివిక్రమ్ వద్ద సిద్ధంగా ఉన్న కథల్లో ‘కోబలి’ ఒకటి. పవన్ కళ్యాణ్ కోసమే ఈ కథను రాసుకున్నారు త్రివిక్రమ్. రాయలసీమ నేపథ్యంలో అనే ఈ కథ కోసం ఆయన లోతైన పరిశోధన కూడ చేశారు. అంత ఇష్టపడి రాసుకున్న ఆ కథను తెరకెక్కించడానికి ఆయనకు అస్సలు వీలుచిక్కట్లేదు. ‘అత్తారింటికిదారేది’ తర్వాతనే ఆ కథ చేయాలని అనుకున్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’ ట్రాక్ మీదకొచ్చింది. ఇక ఆ తర్వాత పవన్ సినిమాలు వదిలేయడం, మూడేళ్ళ గ్యాప్, మళ్ళీ రీఎంట్రీ, తీరిక లేకుండా సినిమా చేస్తుండటం తెలిసిందే.

ఇప్పుడు పవన్ వద్ద త్రివిక్రమ్ కు ఇవ్వడానికి డేట్స్ లేవు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్, హరి హర వీరమల్లు, హరీష్ శంకర్’ సినిమాలు వరుసగా ఉన్నాయి. అవన్నీ పూర్తికావడానికి ఈ ఏడాది ఆఖరు పట్టేలా ఉంది. మధ్యలో ఇంకో దర్శకుడికి కూడ పవన్ డేట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. అందుకే త్రివిక్రమ్ పవన్ ఒప్పుకున్న సినిమాల మధ్యలో కొద్దిగా గ్యాప్ దొరికితే అందులో ‘కోబలి’ని లాగేద్దామని లేదా పవన్ డేట్స్ కలిగిన వేరే దర్శకుడు ఎవరికైనా ఆ కథ ఇవ్వాలని చూస్తున్నారట. మొత్తానికైతే త్రివిక్రమ్ ‘కోబలి’ని పవన్ చేయ చేయించి తీరాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :