ఎన్టీఆర్ రావడం లేట్.. అందుకే కొత్త హీరోను చూసుకున్న త్రివిక్రమ్

Published on Oct 26, 2020 10:47 pm IST


ఇటీవలే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి చిత్రాన్ని ఎన్టీఆర్ చేయాలని ఛాన్నాళ్ల క్రితమే అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికాకపోవడంతో తారక్ ఫ్రీ కాలేకపోయారు. జక్కన షూటింగ్ ముగియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అది పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ వేరే సినిమా చేయడానికి లేదు. సో.. త్రివిక్రమ్ కు తారక్ అందుబాటులోకి రావాలంటే ఇంకా కొన్ని నెలలు టైమ్ పడుతుంది.

అందుకే త్రివిక్రమ్ ఖాళీగా ఉండటం ఎందుకు ఈ గ్యాప్లో ఒక సినిమాను లాగించెయ్యాలని అనుకున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు పెద్ద స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. అందరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. అందుకే ఆయన యంగ్ హీరో రామ్ ను సెలక్ట్ చేసుకున్నారు. రామ్ ప్రస్తుతం చేస్తున్న ‘రెడ్’ ముగింపు దశలో ఉంది. దాని తర్వాత ఏ దర్శకుడితోనూ ఆయన సినిమా కమిటవ్వలేదు. అందుకే త్రివిక్రమ్ అడగ్గానే రామ్ ఓకే చెప్పేశారట. త్వరలోనే వీరి ప్రాజెక్ట్ గురించిన వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.

సంబంధిత సమాచారం :

More