ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లను కలిసిన మంత్రి పువ్వాడ!

Published on Jul 5, 2021 9:17 pm IST

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అతని కుమారుడు డాక్టర్ పువ్వాడ నయన్ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను మంత్రి పువ్వాడ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే మంత్రి పువ్వాడ మరియు ఆయన కుమారుడు డాక్టర్ నయన్ లు మంత్రి కేటీఆర్ ను కలవడం జరిగింది. మంత్రి కేటీఆర్ ను కలిసిన పువ్వాడ అజయ్ కుమార్, నయన్ లు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

అదే విధంగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పుకొచ్చారు. మంత్రి పువ్వాడ మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :