వచ్చే నెలలో సెట్స్ మీదకు తుగ్లక్ !

Published on Apr 24, 2019 3:20 pm IST

ఇటీవల 118 తోప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజుల తరువాత హిట్ కొట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈసినిమా తరువాత స్టోరీ సెలెక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కళ్యాణ్ రామ్. ఇకఇటీవల దర్శకుడు వేణు మల్లిడి చెప్పిన ఓ వైవిధ్యమైన కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సోషియో ఫాంటసి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈచిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్ ప్రచారం లో వుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్నా ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ నిర్మించనున్న ఈచిత్రానికి హీరోయిన్లను ఫైనల్ చేసే పనిలో వున్నారట చిత్ర బృందం.

సంబంధిత సమాచారం :