కొత్త రాజధానిలో షూట్ చేసిన తొలి చిత్రం ‘తుంగభద్ర’

కొత్త రాజధానిలో షూట్ చేసిన తొలి చిత్రం ‘తుంగభద్ర’

Published on Mar 15, 2015 1:08 PM IST

tungabhadra
అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘తుంగభద్ర’. గోగినేని శ్రీ‌నివాస కృష్ణ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప‌ల్లెటూరి రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ స‌త్యరాజ్ కీల‌క పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రపదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలోని లోని అద్భుతమైన పల్లెటూరి అందాలను షూట్ చేసిన తొలి సినిమా ఇదే.

ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రప్రదేశ్ లోని తుల్లూర్, అమరావతి లాంటి అందమైన ప్రాంతాల్లో షూట్ చేసారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మొదట తీసిన సినిమా ఇదే కావడంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. స్టార్స్ కంటే కథను మాత్రమే నమ్మి అతి తక్కువ మంది నిర్మాతలలో ఒకరు సాయి కొర్రపాటి. వారాహి చలన చిత్రం వారు కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తూ చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలను అందుకుంటుంది. గత సంవత్సరం ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలతో హిట్స్ అందుకున్న సాయి కొర్రపాటి ‘తుంగభద్ర’ సినిమా విజయంపై కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు