ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో ఈ ప్రథమార్ధంకి ఆల్రెడీ లాక్ అయ్యి ఉన్న క్లాష్ చిత్రాలు పెద్ది ఇంకా ది ప్యారడైజ్ (The Paradise) లు కూడా ఒకటి. నాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా ప్యారడైజ్ తో వస్తుండగా సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఒక్క రోజు గ్యాప్ లో రాబోతున్నారు.
ఇక మార్చ్ 26, 27 డేట్స్ ని ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాల రిలీజ్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. రీసెంట్ గానే పెద్ది సినిమా ఆన్ టైం రాకపోవచ్చు అని పలు రూమర్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ గా మేకర్స్ కొత్త అప్డేట్ లో అదే డేట్ ని లాక్ చేసి ఉంచారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆన్ టైం లో వస్తుంది అనుకున్న ప్యారడైజ్ (The Paradise) డేట్ అటు ఇటు అయ్యేలా ఉందని ఇప్పుడు వినిపిస్తుంది.
ఈ సినిమాకి ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉందట. అది పూర్తి కావడానికే రెండు నెలలు పట్టే ఛాన్స్ ఉందట. సో ఇప్పుడు నుంచి చూసుకున్నా ఫిబ్రవరి చివరికి లేదా మార్చ్ మొదటి వారానికి కంప్లీట్ అవుతుంది. ఇలా షూట్ పూర్తవ్వాలి, ఇంకోపక్క అప్డేట్స్, అసలే నాని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి సాలిడ్ ప్రమోషన్స్ చేయడం కూడా పక్కా సో అవన్నీ ఉన్న ఆ తక్కువ సమయంలోనే అయ్యే ఛాన్స్ ఉందా? వీటితో ప్యారడైజ్ (The Paradise) మాత్రం కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కొత్త టాక్. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.


