‘సాహసం శ్వాసగా సాగిపో’లో రెండు డిఫరెంట్ షేడ్స్ : నాగ చైతన్య

‘సాహసం శ్వాసగా సాగిపో’లో రెండు డిఫరెంట్ షేడ్స్ : నాగ చైతన్య

Published on Sep 1, 2015 8:41 PM IST

Naga-Chaitanya
‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్‌లు కలిసి తాజాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్‌లో శింబు హీరోగా నటిస్తుండగా, మంజిమా మోహన్ రెండు వర్షన్స్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29న విడుదల చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ టీజర్‌లో సినిమా మూడ్, డైలాగ్స్, నాగ చైతన్య ఎక్స్‌ప్రెషన్స్, ఫ్లేవర్ అంతా ‘ఏ మాయ చేశావే’ను పోలి ఉండడంతో ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమా తనకు మళ్ళీ ఓ సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందని, గౌతమ్ మీనన్-ఏ ఆర్ రెహమాన్ మ్యాజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని నాగ చైతన్య తెలిపారు. ఈ సినిమా మొదటి భాగమంతా ప్యూర్ లవ్, రెండో భాగమంతా స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని నాగ చైతన్య ఈ సందర్భంగా తెలుపుతూ, ఒకే సినిమాలో ఇలా రెండు విభిన్న అంశాలున్న సినిమాలో నటించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు