రెండు సినిమాలకు ఒకే టైటిల్ !

Published on Mar 14, 2019 10:17 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈచిత్రం నాలుగు భాషల్లో తెరకెక్కనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నఈ చిత్రానికి ‘హీరో ‘అనే టైటిల్ ను ఖరారు చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్నినిర్మించనుంది.

అయితే ఇప్పుడు అదే టైటిల్ తో తమిళ హీరో శివ కార్తికేయన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి విజయ్ ,హీరో తమిళ వెర్షన్ కు టైటిల్ మారుస్తారో లేదా అదే టైటిల్ తో సినిమాను అక్కడ విడుదలచేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More