“రాధే శ్యామ్” కోసం మరో రెండు రిలీజ్ డేట్స్ రెడీ !

Published on Jan 30, 2022 9:07 pm IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం కోసం మరో రెండు రిలీజ్ డేట్స్ ప్లాన్ లో ఉన్నాయట. మార్చి 4 మరియు మార్చి 11 ఈ రెండు రిలీజ్ డేట్‌లలో ఒకటి త్వరలో లాక్ చేస్తారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.

కాగా గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి వస్తున్న వరుస అప్డేట్స్ సినిమాపై మరింత హైప్‌ ని క్రియేట్ చేశాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్‌ కె’, ‘స్పిరిట్‌’ వంటి భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంది. ఇవే కాకుండా మరో మూడు ప్రాజెక్టులను కూడా ప్రభాస్ లైన్‌ లో పెట్టినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :