ఇతర భాషల్లో సూపర్ హిట్ అయినా చిత్రాలను రీమేక్ చేయడం ప్రస్తుతం సౌత్ లో ట్రెండ్ గా మారింది. అందులో భాగంగా ఇటీవల కన్నడ లో విజయం సాధించిన రెండు చిత్రాలను తెలుగుతో పాటు తమిళం లోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో మొదటిది ‘బెల్ బాటమ్’ కాగా రెండవది ‘ఫేస్ 2ఫేస్’.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన బెల్ బాటమ్ ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు తో పాటు తమిళం లో రీమేక్ కానుంది. ఈచిత్రం యొక్క రీమేక్ హక్కులు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైయ్యాయి.
ఇక మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఫేస్ 2ఫేస్ గత ఏడాది విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. ఈచిత్రం కూడా తెలుగు , తమిళంలో రీమేక్ కానుంది.


