“వకీల్ సాబ్” లో రెండు స్పెషల్ యాక్షన్ బ్లాక్స్.!

Published on Mar 27, 2021 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆ హంగామా ఎలా ఉండేదో రుచి చూసి చాలా కాలమే అయ్యింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ మాస్ సెలబ్రేషన్స్ టైం “వకీల్ సాబ్” తో వచ్చింది. మొదట్లో పెద్ద హైప్ అందుకోలేదు కానీ ఇప్పుడు టైం దగ్గర పడుతుండడంతో ఆ మాస్ హిస్టీరియా సుస్పష్టంగా కనిపిస్తుంది.

అయితే ఈ చిత్రం బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్ అని తెలిసిందే. మరి ఒరిజినల్ వెర్షన్ కి దీనికి దర్శకుడు శ్రీరామ్ వేణు గట్టి మార్పులే చేసారు. పాటలతో పాటుగా ఫైట్స్ ను యాడ్ చేసి పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా పింక్ షేపులు మార్చేశారు. మరి ఈ చిత్రం సమర్పకులు బోనీ కపూర్ బాలీవుడ్ వర్గాలతో మాట్లాడుతూ ఈ చిత్రం పవన్ ఫాన్స్ కోసం స్పెషల్ గా రెండు యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేశామని అసలు విషయం రివీల్ చేశారు.

ఆల్రెడీ టీజర్ లో కొన్ని ఫైట్ సీన్స్ చూపించారు. అలాగే మరో ఫైట్ కి సంబంధించి ఆ మధ్య కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి బహుశా ఈ రెండు మాత్రమే సినిమాలో ఉంటాయి కాబోలు.. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలి మరియు అనన్య నాగళ్ల లు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం ఇచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించారు..

సంబంధిత సమాచారం :