రాజశేఖర్ కుమార్తె సినిమా ఎంతవరకు వచ్చిందంటే !
Published on Jun 2, 2018 6:15 pm IST


యువ హీరో అడివి శేష్, రాజశేఖర్, జీవితల కుమార్తె శివానీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘టూ స్టేట్స్’. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన పాపులర్ నవల ‘టూ స్టేట్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే మొదలైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ రెండవ షెడ్యూల్ ను కలకత్తాలో నిర్విరామంగా జరిపి ముగించారు.

మూడవ షెడ్యూల్ ను కూడ పెద్దగా గ్యాప్ లేకుండా ఈ నెల 7 నుండి హైదరాబాద్లో మొదలుపెట్టనున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వెంకట్ కుంచం దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా అవుట్ ఫుట్ పట్ల యూనిట్ సభ్యులు సంతృప్తికరంగా ఉన్నారు.

ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా ఇందులో ఉత్తేజ్, ప్రియదర్శి, విద్యుల్లేఖారామన్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook