
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 13న తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ ఒకే సారి విడుదల అవ్వబోతున్న ఈ సినిమా తాజాగా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లతోనే ఈ చిత్రం తెలుగు తమిళ రెండు చోట్ల మంచి బజ్ సృష్టించుకుంది.
కాగా తమిళ వర్షన్ లో.. రెండు గంటల ఎనిమిది నిముషాలు నిడివి గల ఈ చిత్రం ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇటీవలే ఈ చిత్రం నుండి ఓ ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ ప్రమోషనల్ సాంగ్ లో సంగీత దర్శకుడు అనిరుధ్ పాడుతుండగా.. సమంత డాన్స్ చేస్తున్న విజువల్స్ ప్లే చేశారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.