‘రామ్ చరణ్’ అఫీస్ ముందు ‘నరసింహారెడ్డి’ వంశస్థుల ఆందోళన !

Published on Jun 30, 2019 8:01 pm IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్నచిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే కర్నూలు జిల్లా ఉయ్యాలవాడకి చెందిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ వంశస్థులు రామ్ చరణ్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు.

ఈ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్టోరీ మొత్తం తీసుకొని, మాకు ఆర్థికంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చి.. పైగా తమ సొంత ఊళ్లకు వచ్చి తమ ప్రాపర్టీలను సైతం షూటింగ్ కోసం వాడుకుని.. ఇప్పుడు కలవడం లేదని.. కనీసం గేటు లోపలకి కూడా రానివ్వడం లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు ఆందోళన చేస్తున్నారు.

ఐతే మేనేజర్ల వల్లే తాము రామ్ చరణ్ ను కలవలేకపోతున్నామని.. మెగా ఫ్యామిలీ తమకు ఆర్ధిక సహాయం చేస్తోందనే నమ్మకం ఉందని వాళ్ళు చెబుతున్నారు. ఇక భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More