పవన్ కళ్యాణ్ తో కలసినటించాలని కలలుకంటున్న ఉయ్యాలా జంపాల హీరోయిన్

Pawan_avika_gor
విజయవంతమైన ‘ఉయ్యాలా జంపాల’ లో హీరోయిన్ గా నటించిన అవిక గొర్ కోసం తెలుగు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు మంచి అవకాశాలతో ఆమెని కలిసారు అన్నికుదిరితే అవికని మనం మరిన్ని సినిమాలలో చూడొచ్చు.

కాని అవిక ఫేవరెట్ హీరో ఎవరో? సమాచారం ప్రకారం అవికకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆయనతో కలసిపనిచేయాలని కలలుకంటుంది. పవన్ కామెడీ టైమింగ్ ని స్టైల్ ని ఎంతగానే ఇష్టపడే అవిక పవన్ సినిమా ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసింది.

ప్రస్తుతం ‘లక్ష్మి రావే మా ఇంటికి’ అనే చిత్రంలో నాగ శౌర్య సరసన నటిస్తుంది. తన అభిమానుల కోరికలని తీర్చే పవన్ అవిక కోరిక కూడా తీరుస్తారేమో వేచిచూడాలి.

Exit mobile version