నవీన్ నాయని దర్శకత్వంలో తరుణ్ తేజ్, లావణ్య జంటగా రాబోతున్న ‘ఉండిపోరాదే’ చిత్రాన్ని డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి, మైసూర్, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేసిన షూటింగ్ తో ఇప్పటికే ఈ చిత్రం 80 % చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మరో హైదరాబాద్, అండమాన్ దీవుల్లో తీయబోయే సన్నివేశాలతో మిగిలిన 20 % షూటింగ్ కూడా పూర్తి కానుంది.
ఇక ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాగా మా చిత్రంలో కేధార్ శంకర్, సత్య కృష్ణన్, సిధ్ధిక్షా, అల్లు రమేష్, నారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామాంజనేయులు, మాటలు: సుబ్బారాయుడు, సంగీతం: సాబు వర్గీస్, సమర్పణ: సత్య ప్రమీల కర్ణపూడి.


