ఈరోజు “బిగ్ బాస్” లో ఊహించని ఎలిమినేషన్?

ఈరోజు “బిగ్ బాస్” లో ఊహించని ఎలిమినేషన్?

Published on Oct 18, 2020 8:31 PM IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ షో బిగ్ బాస్ ఇప్పుడు సగానికి చేరుకుంటుంది. ఇప్పటికే అందరి కంటెస్టెంట్స్ పై ఒక అంచనా ఆడియెన్స్ కు అలాగే షో హోస్ట్ కింగ్ నాగార్జున కు కూడా వచ్చేసింది. దీనితో బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కొనసాగాలి ఎవరిని బయటకి పంపెయ్యాలి అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది.

అయితే ప్రతీ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలా ఈవారం ఎలిమినేషన్ కు గాను కొంతమంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఊహించని విధమైన ఎలిమినేషన్ ఉంటుంది తెలుస్తుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట.

అయితే వారిలో ఒకరిది నార్మల్ ఎలిమినేషన్ అయితే మరొకటి బిగ్ బాస్ డెసిషన్ వల్ల జరిగే ఎలిమినేషన్ అన్నట్టు తెలుస్తుంది. అది కూడా ఆ ఇద్దరూ మోనాల్ గజ్జర్ మరియు కుమార్ సాయి లు అని టాక్. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు