ఈసారి “బిగ్ బాస్” స్టేజ్ పైకి గెస్ట్ గా ఊహించని స్టార్ హీరో.!

Published on Nov 29, 2020 2:00 pm IST

ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటున్న బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ లో భాగంగా నిన్నటి ఎపిసోడ్ విషయంలో ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. అలాగే మరో పక్క ఎలిమినేషన్ కూడా ఉందా లేదా అన్నది కూడా మరో పక్క ఆసక్తికరంగా మారింది. అయితే ఈరోజు సండే ఫన్ డే కావడంతో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఊహించని మలుపులు కూడా బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకుంటాయి.

అయితే బిగ్ బాస్ షో అంటే ఖచ్చితంగా పలువురు బడా స్టార్స్ కూడా గెస్టులుగా వస్తారన్న సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు ఓ ఊహించని అతిధి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. అతడే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. మన తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉన్న ఈ హీరోగా ఈరోజు ఎపిసోడ్ లో నాగ్ తో కలిసి హోస్ట్ చేయనున్నట్టుగా చూపిస్తున్నారు.

అయితే ముందు తానే హోస్ట్ గా వచ్చినట్టు ఎంట్రీ ఇచ్చారు. దీనితో కంటెస్టెంట్స్ నాగ్ కూడా కావాలి అంటే అప్పుడు నాగ్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ ఇద్దరూ కలిసి ఒకే స్టేజ్ పై ఎలా హోస్ట్ చేయనున్నారో ఎవరిని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపిస్తారో తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More