ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి సెన్సేషనల్ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ రిలీజ్ కి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక ఇలా రోజుకో సరికొత్త పోస్టర్ తో ట్రీట్ ఇస్తున్న మేకర్స్ ఈ చిత్రానికి ఊహించని రన్ టైం ని అయితే లాక్ చేశారట. అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు చూస్తే దాదాపు 3 గంటల దగ్గర నిడివి ఉన్నవే ఉన్నాయి. ఒక్క ఖైదీ తక్కువ రన్ టైం తో వచ్చింది.
అయితే విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలు అంత రన్ టైం ఉన్నా కూడా సాలిడ్ ట్రీట్ ని అందించాయి. ఆ రేంజ్ లో సినిమా అందించిన లోకేష్ ఇప్పుడు లియో కి కేవలం 2 గంటల 39 నిమిషాల రన్ టైం మాత్రమే కట్ చేశాడట. ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి సర్ప్రైజ్ లు ఎక్కువ ఉంటాయి అని పైగా విజయ్ ని కూడా ఎక్కువ స్క్రీన్ టైం చూడొచ్చు అని చాలా మంది అనుకోని ఉంటారు. కానీ ఈ సినిమా ఇలాంటి రన్ టైం ని కట్ చేసుకుంది అని ఊహించి ఉండకపోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
