టాక్..”రాధే శ్యామ్” టీజర్ లో ఊహించని సర్ప్రైజ్ ఉందట.!

Published on Oct 21, 2021 10:03 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం నుంచి ఎట్టకేలకు చిత్ర యూనిట్ టీజర్ ను అక్టోబర్ 13న ప్రభాస్ బర్త్ డే కానుకగా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేశారు. అయితే ఈ టీజర్ ఒక్క విజువల్ వండర్ గానే కాకుండా ప్రభాస్ చేస్తున్న విక్రమ్ ఆదిత్య పాత్ర ను విశదీకరించే విధంగా ఆసక్తిగా ఉంటుందని టీజ్ చేస్తున్నారు.

అయితే ఈ రానున్న టీజర్ పైనే మరో ఊహించని సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా కేవలం ప్రేమకథగా మంచి పాయింట్ తో వస్తుంది కాబట్టి పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉండవని తెలిసింది. అయితే ఉంటే ఒక్కటి మాత్రం ఉంటుందని బజ్ వచ్చింది అప్పుడు.

మరి ఇది నిజమే అన్నట్టు తెలుస్తుంది. పైగా ఈ టీజర్ లో కూడా ఆ యాక్షన్ సన్నివేశం తాలూకా విజువల్స్ కూడా కనిపించనున్నట్టు సమాచారం. మరి ఇదే నిజం అయితే అందరికీ ఈ సినిమా నుంచి ఊహించని ఫీస్ట్ అనే చెప్పాలి. సో ఈ అద్భుతమైన టీజర్ కట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొక రోజు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More