లేటెస్ట్..”గబ్బర్ సింగ్” కాంబోపై ఊహించని టాక్.!

లేటెస్ట్..”గబ్బర్ సింగ్” కాంబోపై ఊహించని టాక్.!

Published on Jun 25, 2021 3:07 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాల్లో “గబ్బర్ సింగ్” చిత్రానికి ఎలాంటి ప్లేస్ ఉంటుందో తెలిసిందే. అవ్వడానికి రీమేక్ సినిమా అయినా కూడా దర్శకుడు హరీష్ శంకర్ తన టేకింగ్ తో మరో స్థాయిలో ఈ చిత్రాన్ని నిలిపాడు. దీనితో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రేజీ కాంబోపై అంచనాలు పీక్స్ లో అలా స్టాండర్డ్ గా నిలిచిపోయాయి.

అందుకే అదే బాటలో వీరి నుంచి మరో సినిమా అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా భారీ హైప్ సెట్టయ్యింది. మరి ఈ చిత్రంపైనే ఇంట్రెస్టింగ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కొన్నాళ్ల కితమే పవన్ మేకోవర్ కోసం టాక్ రాగా ఇప్పుడు ఊహించని టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రానికి గాను కథలో హరీష్ తో పాటు పవన్ కూడా పాలు పంచుకోనున్నారట. అంటే ఇద్దరి నుంచీ ఈ సినిమా కథ సిద్ధం అవుతుందని తెలుస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు