పవన్ క్రేజీ రీమేక్ పై ఈ టాక్ నిజమేనా.?

Published on Jul 15, 2021 7:53 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. మాస్ ఆడియెన్స్ లో సాలిడ్ అంచనాలు ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ నిమిత్తం సిద్ధం కానుంది. అయితే సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే..

మరి ఇలాంటి సినిమాపై ఓ ఊహించని టాక్ బయటకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ప్రసాద్ మురెళ్ళ ఈ సినిమా నుంచి బయటకి వచ్చేసినట్టు తెలుస్తుంది. మరి దానికి గల సరైన ఏంటో తెలియలేదు కానీ ఈ టాక్ సినీ వర్గాల్లో నడుస్తుంది. అలాగే దీనిపై అధికారిక క్లారిటీ కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :