మహేష్,త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ఊహించని అప్డేట్.!

Published on Jul 4, 2021 12:01 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ పెట్లతో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం రెండో షెడ్యూల్ కి కూడా ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది. అయితే ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. అంతకు మించిన అంచనాలు తర్వాత ప్లాన్ చేసిన త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ పై నెలకొన్నాయి.

మహేష్ మరియు త్రివిక్రమ్ నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా త్వరలోనే షూట్ మొదలు పెట్టుకోనుంది. ఈ సమయంలో ఈ చిత్రంపై ఒక ఊహించని అప్డేట్ నే బయటకి వచ్చింది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ప్లాన్ చెయ్యగా వాటిలో ఆల్రెడీ మూడు పాటలు కంప్లీట్ అయ్యిపోయాయట.

అలాగే రీ రికార్డింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నట్టుగా సంగీత దర్శకుడు థమన్ క్లబ్ హౌస్ లో తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం ఊహించనిదే అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా హారికా హాసిని వారే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :