సాయిధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

Published on Jan 1, 2022 8:02 pm IST

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌ రెండు నెలల క్రితం రోడ్డు యాక్సిడెంట్‌కి గురైన సంగతి తెలిసిందే. సుమారు 40 రోజుల‌కు పైగా అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్న సాయితేజ్, ఆ తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సాయిధరమ్‌ తేజ్‌ను కలిసి పరామర్శిస్తున్నారు.

అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించారు. నేడు హైదరాబాద్‌లోని సాయిధరమ్‌ తేజ్‌ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిని గురుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్‌లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించినందుకు కిషన్ రెడ్డికి సాయిధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలియచేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

సంబంధిత సమాచారం :