సర్జరీ నుంచి డిశ్చార్జ్ అయిన విశ్వ నటుడు.!

Published on Jan 22, 2021 3:05 pm IST

విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం తన సినిమాలు అలాగే రాజకీయాలను కూడా చాలా బ్యాలెన్స్ చేస్తూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి తమిళ నాట జరగనున్న ఎన్నికలకు గాను తన పార్టీ మక్కల్ నిది మయ్యమ్ ప్రచారాన్ని అకస్మాత్తుగా ఆపడం అలాగే ఆ సమయంలో కమల్ కూతురు మరియు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన తండ్రి ఒక శస్త్ర చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని క్లారిటీ ఇచ్చింది.

మరి ఇదిలా ఉండగా శ్రీ రామచంద్ర మెడికల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన కమల్ తన కాలికి సంబంధించిన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టు నిర్దారణ అయ్యింది. అంతే కాకుండా అది అయ్యాక కమల్ డిశ్చార్జ్ కూడా అయ్యారు. కాకపోతే మరికొన్ని రోజులు విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు చెప్పారు. దీనితో కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని కమల్ మళ్ళీ తన ప్రచారంతో పాటుగా శంకర్ తో “భారతీయుడు 2” లోకేష్ కనగ్ రాజ్ తో “విక్రమ్” సినిమా షూట్ లను షురూ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :