అన్ స్టాపబుల్: నాని డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య!

Published on Nov 8, 2021 7:44 pm IST

ఆహా వీడియో సరికొత్త షో ను మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ తో చేస్తున్న అన్ స్టాపబుల్ షో పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ తో అలరించిన బాలయ్య, ఇప్పుడు నాని తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అన్ స్టాపబుల్ కి సంబంధించిన రెండవ ఎపిసొడ్ ప్రోమో ను తాజాగా ఆహా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో లో నాని మరియు బాలకృష్ణ లు ఆద్యంతం ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ తో అలరించారు.

నాని జనం నుండి స్టేజ్ పైకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు అంశాల గురించి చర్చించారు. క్రికెట్ గురించి బాలయ్య పలు విషయాలను వెల్లడించారు, అంతేకాక స్టేజ్ పై క్రికెట్ ను ఆడి ఆకట్టుకున్నారు. అంతేకాక ఈగ చిత్రం లోని నాని డైలాగ్ ను బాలకృష్ణ రీ క్రియేట్ చేసారు అని చెప్పాలి. అదే విధంగా నాని సైతం బాలకృష్ణ డైలాగ్ ను చెప్పి ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకున్నారు అయితే ఇంకా పలు అంశాల గురించి సైతం మాట్లాడటం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నవంబర్ 12 వ తేదీన ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :