నేటి నుండి అక్కడ థియేటర్స్ ఓపెన్ !

Published on Jul 5, 2021 9:30 am IST

కరోనా మహమ్మారి దెబ్బకు మూతబడిన థియేటర్లు మళ్ళీ కొత్త సినిమాల రాకతో కళకళలాడటానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నుంచి సినిమాహాళ్లను తెరుచుకోబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సినిమాహాళ్లు, మల్టీప్లెక్సులు, స్టేడియాలను తెరవడానికి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొత్తానికి కరోనా పరీక్షలను పెంచి, ర్యాపిడ్ చికిత్స చేసి, వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేయడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడిలోకి వచ్చింది. యూపీలో గత 24 గంటల్లో 128 కరోనా కేసులు వెలుగుచూడగా, 305 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పైగా కరోనా రికవరీ రేటు 98.5శాతానికి పెరగడంతో పాటు పాజిటివ్ రేటు 0.06 శాతానికి తగ్గింది. దీంతో సినిమాహాళ్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుమతించారు.

సంబంధిత సమాచారం :