మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ, మెగాస్టార్ ఏం మాట్లాడారు అంటే.. ‘రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు శనివారం రాత్రి కవలలు జన్మించారు. దీంతో కొణిదెల, కామినేని కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ భగవంతుడి దయ, హనుమాన్ కృపతో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు’ అని చిరంజీవి తెలిపారు.
మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట శుభం కలగాలని ఎక్కడెక్కడి నుంచో అభిమానులు కోరుకున్నారు. ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా అభిమానులు దీన్ని పండుగలా భావిస్తున్నారు. వారి ఆనందానికి అవధుల్లేవు. అందరికీ ధన్యవాదాలు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
