కొత్త బాధ్యతలు స్వీకరించనున్న ఉపాసన

Published on Jun 23, 2021 6:02 pm IST

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ ఉపాస‌న కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. మరీ ముఖ్యంగా అవగాహనా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. హెల్త్ కేర్ గురించి ఎప్పటి నుండో తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్న ఆమె ఈమధ్య వ్యాక్సినేషన్ విషయంలో కూడ జనానికి అవగాహన కల్పించారు. ఆమెలోని ఈ సామాజిక స్పృహను చూసే వ‌ర‌ల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేష‌న్‌ వారు ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియమించారు.

కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ఇతర హాస్పిటల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఎన్నో ప్రాణాలను కాపాడారు. అలాగే ఫారెస్ట్ సిబ్బంది కూడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక ఇబ్బందులు నడుమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరందరికీ తగిన గుర్తింపు లభించేలా చేయడమే ఉపాసన బాధ్యత. ఉపాసన సైతం ఇలాంటి భాధ్యతకు తనను ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :