హీరో సల్మాన్ మరోకోణాన్ని బయటపెడతానంటున్న ఉపాసన కొణిదెల.

Published on Jun 7, 2019 10:17 am IST

ఉపాసన కొణిదెల స్టార్ హీరో భార్యగానే కాకుండా తనదైన చర్యలతో ప్రత్యేకంగా ఉంటారు. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఉపాసన ఆమె ఆక్టివిటీస్ గురించి అప్ డేట్స్ తన ఫాలోయర్స్ కి ఇస్తూ ఉంటారు. ఇటీవల ఆఫ్రికా దేశంలో భర్త రాంచరణ్ తో కలిసి వైల్డ్ లైఫ్ సఫారీ సహస యాత్ర కు సంబందించిన ఫొటోలు షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మంచి వ్యాఖ్యాత కూడా ఐన ఉపాసన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని ఇంటర్వ్యూ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. సల్మాన్ తన లేటెస్ట్ మూవీ’భారత్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఉపాసనతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ని ప్రశ్నలు అడిగిన ఉపాసన అతని రహస్యాలతో పాటు, సల్మాన్ లో ఉన్న మరో యాంగిల్ ని మీకు పరిచయం చేస్తాను అని చెవుతున్నారు. అపోలో స్టూడియోస్ లో చిత్రీకరించిన ఆ ఇంటర్వ్యూ తాలూకు ప్రోమో ని ఉపాసన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ‘బి పాజిటివ్ విత్ ఉపాసన’ అనే కార్యక్రమం లో భాగంగా సల్మాన్ ని ఉపాసన ఇంటర్వ్యూ చేశారు.

సంబంధిత సమాచారం :

More