“ఆర్ఆర్ఆర్” మూవీ సెట్స్ లో ఉపాసన కొణిదెల!

Published on Aug 12, 2021 7:05 pm IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో టాలివుడ్ టాప్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రం టీమ్ ఉక్రెయిన్ లో ఉండగా, కొణిదెల ఉపాసన సైతం సెట్స్ లో కనబడటం జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ను కొణిదెల ఉపాసన సోషల్ మీడియా లో షేర్ చేయడం జరిగింది. RRR రామ్ చరణ్ తో ఉన్న ఫోటో తో సెట్స్ లో కనబడటం జరిగింది. అయితే అక్కడ తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు పూజ, ఎస్ ఎస్ కార్తికేయ, రమగారికి, ఎస్ ఎస్ రాజమౌళి గారికి, ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి థాంక్స్ తెలిపారు. అందరినీ కూడా త్వరలో హైదరాబాద్ లో కలిసేందుకు చూస్తాను అని అన్నారు.

ఈ చిత్రం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల సరసన హీరోయిన్ లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటించడం జరిగింది. శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :