ప్రియాంక చోప్రాకి ఉపాసన థ్యాంక్స్

Published on Mar 11, 2023 7:30 pm IST

దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఈ నెల 12వ తేదీన (భారత్ లో 13) లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌‌ లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, రాజమౌళి యూఎస్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఐతే, గోల్డెన్ బ్యూటీ ప్రియాంక చోప్రా దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు భారత సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రాతో కలిసి రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఫొటో దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే, ఉపాసన.. ప్రియాంక చోప్రాకి కృతజ్ఞతలు చెబుతూ.. ‘హాలీవుడ్ లో ఎల్లప్పుడూ తమ కోసం బాసటగా ఉన్న ఆమెకు థ్యాంక్స్ అని ఉపాసన చెప్పింది.

సంబంధిత సమాచారం :