యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కింగ్ నాగార్జున మరియు నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం దేవదాస్. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ లోగోకు మంచి స్పందన లభించింది. ఐతే నెటిజన్లతో పాటు ప్రేక్షకులు కూడా గత కొన్ని రోజులుగా దేవదాస్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ రోజు ‘దేవదాస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. కాగా ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం మంచి కామెడీతో ఎంటర్ టైనర్ గా సాగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. నాని మొదటిసారిగా, స్టార్ హీరో నాగార్జునతో కలిసి నటించడంతో ఈ దేవదాస్ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, నానిల సరసన ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగ్ రౌడీ పాత్రలో నటిస్తుండగా, నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు.


