‘ఓటీటీ & థియేటర్స్’ : ఈ వారం చిత్రాలివే

‘ఓటీటీ & థియేటర్స్’ : ఈ వారం చిత్రాలివే

Published on Mar 18, 2024 11:22 AM IST

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’. ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ‘అనన్య’, ‘హద్దులేదురా’ వంటి చిన్న చిత్రాలు కూడా మార్చి 21న థియేటర్‌లలో విడుదల కాబోతున్నాయి.

అయినప్పటికీ, ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

3 బాడీ ప్రాబ్లమ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫైటర్‌ (హిందీ) మార్చి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) మార్చి 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ప్లే గ్రౌండ్‌ (హిందీ సిరీస్‌) మార్చి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

మరక్కుమ నెంజాం (తమిళ) మార్చి 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ వతన్‌ మేరే వతన్‌ (హిందీ) మార్చి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రోడ్‌ హౌస్‌ (హాలీవుడ్‌) మార్చి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

లూటేరా (హిందీ) మార్చి 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :

ఫ్రాయిడ్స్‌ లాస్ట్‌ సెషన్‌ (హాలీవుడ్) మార్చి 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

ఓపెన్‌ హైమర్‌ (హాలీవుడ్) మార్చి 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ :

సుందరం మాస్టర్‌ (తెలుగు) మార్చి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా:

భూతద్దం భాస్కర్ నారాయణ (తెలుగు) మార్చి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు