వైవిధ్యమైన చిత్రాల దర్శకడు రవిబాబు సుదీర్ఘమైన విరామం తర్వాత తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే నెటిజన్లు కూడా ఈ చిత్ర ట్రైలర్ ను షేర్ చేస్తూ.. లైక్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే.. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ తో సాగుతుందని అర్ధమవుతుంది. ముఖ్యంగా బంటి చేస్తున్న రిస్కీ షాట్స్ ఆకట్టుకున్నే విధంగా ఉన్నాయి. మొత్తానికి రవిబాబు ఈ చిత్రాన్ని రెండున్నర సంవత్సరాలు పాటు కష్టపడి రూపొందించినందుకు ఫలితం దక్కేలానే ఉంది.
కాగా ఈ సినిమా మొత్తం బంటి (పందిపిల్ల) చుట్టూ కేంద్రీకృతమై ఉండటం, విఎఫ్ఎక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో చిత్రం కూడా బాగా వచ్చిందట. లైవ్ యాక్షన్ త్రీడీ సాంకేతికతో రోపొందిన ఈ చిత్రం పలు భాషల్లో రిలీజ్ కానుంది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.


