‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ స్టేటస్.. తిరుపతిలో ఏం చేస్తున్నారంటే..?

‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ స్టేటస్.. తిరుపతిలో ఏం చేస్తున్నారంటే..?

Published on Mar 6, 2026 9:59 PM IST

Srinivasa Mangapuram

డైరెక్టర్ అజయ్ భూపతి తన విలక్షణమైన శైలితో తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరకు పరిచయమవుతుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నేపథ్యంలో, గతంలో ఎన్నడూ చూడని సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా 3వ కీలక షెడ్యూల్ తిరుపతిలో విజయవంతంగా పూర్తయింది. ఇప్పటివరకు దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా జయకృష్ణ, రాషా తడానిలపై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు అజయ్ భూపతి ఇప్పటికే చిత్రీకరించాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి సాంకేతిక బలాన్ని చేకూరుస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు