అఖిల్ కొత్త సినిమాపై అప్డేట్ !

అఖిల్ కొత్త సినిమాపై అప్డేట్ !

Published on Apr 18, 2018 11:01 AM IST

చివరిగా ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన అక్కినేని అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి తన మొదటి చిత్ర్రం ‘తొలిప్రేమ’తోనే ప్రేక్షకుల హృదయలను గెలుచుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది.

ప్రస్తుతం ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. వాటిలో భాగంగానే సంగీత దర్శకుడు తమన్ సారథ్యంలో కంపోజింగ్ మొదలైంది. అట్లూరి గత చిత్రం ‘తొలిప్రేమ’కు కూడ తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బివిఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జార్జి సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

ఇకపోతే అఖిల్ తన నాల్గవ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేయనున్నారు.

తాజా వార్తలు