‘అంతరిక్షం’ షూటింగ్ బిజీలో వరుణ్ !

Varun2

‘ఫిదా , తొలిప్రేమ’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న యువ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్. ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లోని ప్రముఖ స్టూడియోలో జరుగుతుంది. ఈషెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ఆఫీస్ సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం దాంట్లో వరుణ్, శ్రీనివాస్ అవసరాల పై కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తరువాత ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది.

లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రాన్నిఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వరుణ్ ఈచిత్రంతో పాటు అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 2’అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

Exit mobile version