బన్నీ మార్పులు.. త్రివిక్రమ్ చేర్పులు.. !

Published on Mar 1, 2019 11:00 pm IST

త్రివిక్రమ్ తన తరువాత సినిమాను అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా త్వరలో షూటింగ్ మొదలవాల్సిన ఈ సినిమా పోస్ట్ పోనే అయ్యేలా కనిపిస్తోంది. త్రివిక్రమ్ చెప్పిన కథలో బన్నీ కొన్ని మార్పులు కోరాడట. మార్పులు చేసి మళ్ళీ బన్నీకి విపించినా.. బన్నీ మాత్రం స్క్రిప్ట్ లో పూర్తిగా సంతృప్తిచెందలేదని తెలుస్తోంది.

దాంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మరిన్నీ మార్పులు చేస్తున్నారు. దీంతో సినిమా షూట్ పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది. ఇక గతంలో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ను కాస్త వైవిధ్యంగా చూపించనున్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్. మరి ఈ సినిమాలో బన్నీలో ఏం కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More