‘మారి 2’ ఫస్ట్ లుక్ పై నెటిజన్ల ఆసక్తి !

‘మారి 2’ ఫస్ట్ లుక్ పై నెటిజన్ల ఆసక్తి !

Published on Nov 3, 2018 12:20 AM IST

maari2

తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘మారి 2’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడదల చేసంది చిత్రబృందం. అయితే ఈ ఫస్ట్ లుక్ పై నెటిజన్లు బాగానే ఆసక్తి చూపిస్తోన్నారు. బాగా వైరల్ అవుతుంది. ‘మారి’ని తెరకెక్కించిన బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్‌ కూడా రాబోతోంది. సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి. అయితే మారి తెలుగులో ‘మాస్’ పేరుతో రిలీజ్ అయింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు