గీత గోవిందం డైరక్టర్ హింట్ ఇచ్చాడు !

Published on Dec 25, 2018 10:50 am IST

‘గీత గోవిందం’తో సెన్సేషనల్ హిట్టు కొట్టి స్టార్ డైరక్టర్స్ జాబితాలో చేరిపోయాడు పరుశురాం. ఈ చిత్రం తరువాత ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే నిన్న ఆయన బర్త్ డేసందర్బంగా కొత్త సినిమా ఫై హింట్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ టాప్ హీరో తో చేస్తున్నాని ప్రస్తుతం సినిమా కు సంభందించిన ప్రీ ప్రోడక్షన్ జరుగుతుందని తెలిపాడు.

అయితే సన్నిహిత వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఆ టాప్ హీరో అల్లు అర్జున్ అని తెలుస్తుంది. ఇక పరశురామ్ , బన్నీ తో ఎప్పటినుండో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యిందని సమాచారం. తర్వలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :