నెలాఖరుకు విడుదలకానున్న ‘కృష్ణార్జున యుద్ధం’ ట్రైలర్ !
Published on Mar 11, 2018 7:02 pm IST

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మెర్లకపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం యొక్క టీజర్ నిన్ననే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని చిత్తూరుకు చెందిన పల్లెటూరి యువకుడిగా, విదేశాల్లో ఉండే రాక్ స్టార్ గా కనిపిస్తున్నాడు.

నాని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ మార్చి నెలాఖరున విడుదలకానుంది. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిపాప్ తమిజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

 
Like us on Facebook